ఏపీలోని కర్నూలులో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రెవెల్ బస్సు అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. వీరిని ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
మరోవైపు, ఏపీలోని కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.