ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 43 మంది ప్రయాణికులు కూర్చొనేవిధంగా అనుమతి తీసుకున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని ఈ బస్సును స్లీపర్ కోచ్ లగ్జరీ బస్సుగా మార్చారు. ఆ తర్వాత ఈ బస్సును డబ్యూడామన్ (డీడీ)లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది.
ఒరిసా రాష్ట్రంలోని రాయగఢలో ఆల్ట్రేషన్, ఫిట్నెస్ చేయించుకుంది. ఈ బస్సు ఆల్ట్రేషన్‌కు రాయగఢ్ అధికారులు సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు. కానీ కావేరీ ట్రావెల్స్ 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్ కోచ్‌గా మార్చింది. ఆ తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్రంలో బస్సును రిజిస్టేషన్ చేశారు. 2023లో ఎన్.ఓ.సితో డయ్యూడామన్‌లో మరోమారు రిజిస్ట్రేషన్ చేయించుకుని స్లీపర్ కోచ్‌గా మార్చారు.
కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం
ఏపీలోని కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి మాత్రం ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ధృవీకరించారు. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి నలుగురు సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ వార్త ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు శుక్రవారం వేకువజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో సహా సజీవదహనమయ్యారు. ఉపాధి నిమిత్తం బెంగుళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుంటగా ఈ ఘోరం జరిగింది. కుటుంబం మొత్తం మృత్యువాతపడటంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది.
కాగా, ఈ ప్రమాదంలో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూపూర్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి తన కారులు ఆరుగురు క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అదేవిధంగా పుట్టపర్తి నుంచి వస్తున్న హైమరెడ్డి అనే మహిళ బస్సులో మంటలు రవడానని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.