ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా రావణాసుర, భోళా శంకర్ మాత్రమే చేశా : సుశాంత్

సోమవారం, 3 ఏప్రియల్ 2023 (15:44 IST)
Sushant
థ్రిల్లర్ చేయడం నాకిది  మొదటిసారి కాదు.  ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో కొంత థ్రిల్లర్ వుంటుంది. కానీ కంప్లీట్ థ్రిల్లర్ మాత్రం  రావణాసురనే. ఇందులో కొత్తగా కనిపించే అవకాశం వచ్చింది. ఈ సినిమా చేయడానికి కారణం అదే. వెర్సటైల్ యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. రావణాసురలో ఆ కొత్తదనం కనిపిస్తుంది అని సుశాంత్ అన్నారు. 
 
రవితేజ హీరోగా నటించిన ‘రావణాసుర’ను  సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సుశాంత్ రావణాసుర విశేషాలని విలేకరులు సమావేశంలో పంచుకున్నారు.
 
 రావణాసుర కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?
అభిషేక్ గారు ఫోన్ చేసినపుడు.. ఒక కథ రెడీ చేసి సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను. అభిషేక్ గారికి కూడా అదే చెప్పాను. కానీ కథ విన్నపుడు మాత్రం చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ప్రేక్షకుడిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. నా పాత్ర చాలా కీలకంగా వుంది. సినిమా అంతా వుంటుంది. దీనికి మరో డైమెన్షన్ తోడైతే బావుంటుదని చెప్పాను. సుధీర్ వర్మ గారికి కూడా అది నచ్చి చాలా ఫాస్ట్ గా వర్క్ చేసి నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా ఆ డైమెన్షన్ ని తీసుకొచ్చారు. మరో లేయర్ యాడ్ అయ్యింది. రవితేజ గారికి కూడా ఇది చాలా నచ్చింది. నేను అనుకున్న దాని కంటే చాలా బాగా వచ్చింది.
 
‘రావణాసుర’ మీరా రవితేజ గారా ?
‘సుశాంత్ యాజ్ రామ్’ని రావణాసుర పోస్టర్ రిలీజ్ చేశారు. రావణాసుర టైటిల్ రోల్ రవితేజ గారు చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే గ్రే షేడ్స్ అందరికీ వున్నాయి. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ట్యాగ్ లైన్ వుంది. మరి ఇందులో రాముడు ఎవరో.. రావణాసురుడు ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రావణాసుర చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుంది. 
 
రవితేజతో కాంబినేషన్ సీన్ల్ ఎలా వుంటాయి ?
ఖచ్చితంగా థియేటర్లో చాలా ఆసక్తికరంగా వుంటాయి. రవితేజ గారిని కొత్తగా చూపించారు. నన్ను కొత్తగా చూపించారు. సీన్స్ అన్నీ ఇంట్రస్టింగా ఎక్సయిటింగ్ వుంటాయి.
 
ఇందులో మీ పాత్ర నుంచి ప్రేక్షకులు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారాని భావిస్తున్నారు ?
ఎక్స్ పెక్ట్ కంటే ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిట్ మెంట్ వుంది. చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ వినలేదు చూడలేదు. అందుకే కథ వినగానే ఓకే చేశాను. ప్రేక్షకులు కూడా ఈ కొత్తదనం ఫీలౌతారు.
 
 మీరు  ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవున్నాయి ? అయితే సినిమాలు మాత్రం చాలా సెలెక్టివ్ గా.. గ్యాప్ తీసుకొని చేస్తున్నారని అనిపిస్తుంది? 
అక్కినేని కుటుంబం నుంచి రావడం నా అదృష్టం. అయితే నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న  అవకాశాలతోనే ముందుకు వెళ్లాను. కొన్ని సినిమాలు ఆలస్యం కావడం, అనుకున్న  సమయానికి రాకపోవడం ..ఇలా నా చేతుల్లో లేనివి కూడా కొన్ని జరిగాయి.  ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందని కొన్ని సార్లు నాకే తెలియలేదు. అయితే ఇంత గ్యాప్ వచ్చిన నా మైండ్ లో ఎప్పుడూ నెక్స్ట్ సినిమా చేస్తున్నామనే స్ఫూర్తి వుండేది. చిలసౌ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని అని బలంగా నిర్ణయించుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది. దీంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది. అయితే గత ఆరు నెలలుగా చాలా బిజీగా వున్నాను. సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను. ఇంకొన్ని కథలు వింటున్నా.
 
 ‘అల వైకుంఠపురములో’ తర్వాత మీ కెరీర్ మరో మలుపు తీసుకుందని అనుకోవచ్చా ?
 ‘అల వైకుంఠపురములో’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నార్త్ లో కూడా ఫేం తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అయితే నేను అన్నీ చేయలేదు. రావణాసుర, భోళా శంకర్.. ఇలా ఎక్సయిట్ చేసిన సినిమాలు మాత్రమే చేశా.
 
కొత్తగా చేస్తున్న సినిమాలు
సోలో హీరో గా ఈ ఏడాది ఒక సినిమా వుంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు