డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అహింస తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. చిత్రం 2 అని మొదట పేరు అనుకున్నారు. కానీ కథను బట్టి అహింస గా మార్చారు.