అకిరా నందన్ స్టైలిష్ గడ్డంతో కనిపించాడు. ఇది అభిమానులలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి కేరళ, తమిళనాడు అంతటా ఆలయ పర్యటన చేస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల తిరువనంతపురం సమీపంలోని శ్రీ పరశురామ ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలలో అకిరా నందన్ తాజా లుక్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆ చిత్రాలు వైరల్ అయ్యాయి. అలాగే జనసేన సోషల్ మీడియా అధికారిక ఖాతాలో అకిరా నందన్, పవన్ అగస్త్య మహర్షి ఆలయంలో ప్రదక్షిణలు, పూజలు చేస్తున్న ఫోటోలని, వీడియోలని షేర్ చేశారు. అందులో అకిరా ఫుల్ గడ్డంతో, బాగా జుట్టు పెంచుకొని… తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో కనిపించడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.