ఛాన్స్ వస్తే అకిరా నందన్‌తో ఖుషి 2 ప్లాన్ చేస్తా

డీవీ

సోమవారం, 6 జనవరి 2025 (10:37 IST)
Akira Nandan
పవన్ కళ్యాణ్ తో ఎస్.జె. సూర్యకు వున్న అనుబంధం తెలిసిందే. ఆయన షూటింగ్ లో వున్నప్పుడు ప్రపంచం గురించి మాట్లాడేవారు. దర్శకుడు తనపని తాను చేసుకుకంటూ కాసేపు పవన్ చర్చల్లో పాల్గొనేవాడు. ఆ సినిమా ఊహించని హిట్ అయ్యాక దానికి కొనసాగింపుగా సినిమా తీయాలని ప్రకటించారు. కానీ ఇద్దరూ బిజీ కావడంతో ఖుషి 2 వర్కవుట్ కాలేదు. ఇప్పుడు పవన్ సినిమా చేసే స్థితిలో లేరు. అందుకే వాళ్ళబ్బాయి తో సినిమా చేస్తే బాగుంటుందని ఐడియా వచ్చింది. 
 
ఈ విషయమై సూర్య స్పందిస్తూ, ఇప్పుడు నేను దర్శకుడికంటే నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారెలానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే  అకిరా నందన్‌తో ఖుషి 2 జరుగుతుందేమో చూడాలి అని మనసులోని మాటను వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు