తెలుగు అక్షరాలను దిద్దుతున్న బాలీవుడ్ బ్యూటీ

సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:23 IST)
తెలుగు తెలియకపోవడం లేదా అరకొరగా మాట్లాడటం ఫ్యాషన్‌గా ఉన్న తెలుగు పరిశ్రమలో అడుగుపెడ్తున్న పరభాషా హీరోయిన్‌లు తెలుగు నేర్చుకుని మరీ తామే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదగడం ఒక శుభపరిణామమే. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా ఇదే బాట పట్టారు ప్రస్తుతం. 
 
తెలుగు నేర్చుకునే పనిలో తలమునకలైన ఆలియా ప్రస్తుతం ఐప్యాడ్‌లో తెలుగు అక్షరాలను దిద్దుతున్నారు. ఇదంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసమే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రాంచరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేయడం కోసం తెలుగు నేర్చుకోవడానికి స్పెషల్‌ క్లాసులకు వెళ్తున్నారట ఆలియా.
 
ఈ విషయం గురించి అడగగా, ఆలియా ‘‘తెలుగు నేర్చుకోవడం సవాలుగా ఉంది‌. ఎందుకంటే తెలుగు భాష కొంచెం కష్టం, అయినప్పటికీ భావాలను వ్యక్తపరచడానికి అవకాశం ఎక్కువగా ఉన్న భాష కూడా. భాషకు సంబంధించిన చిన్న చిన్న వివరాలన్నీ తెలుసుకుంటున్నాను. నా పాత్ర, దానికి ఉన్న డైలాగ్‌లను పూర్తిగా తెలుసుకోవడానికి ఇది అవసరం. ఏదైనా ఒక తెలుగు వాక్యం పూర్తిగా పలికినా ఏదో సాధించినట్టు ఫీల్‌ అవుతున్నాను’’ అంటూ సంబరపడిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు