గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

ఠాగూర్

సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (13:21 IST)
అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో నిర్మాత బన్నీ వాసు నిర్మించిన చిత్ర 'తండేల్'. ఈ నెల 7వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి ప్రీరిలీజ్ ఈజెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సివుంది. కానీ, ఆయన హాజరుకాలేదు. దీనిపై అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తీవ్రమైన గ్యాస్ సమస్య కారణంగా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడని వివరణ ఇచ్చారు. 
 
ఆ తర్వాత హీరో నాగ చైతన్య మాట్లాడుతూ, 'తండేల్' మూవీ చివరి దశలో తనకు భయం ప్రారంభమైందని అన్నారు. చిత్ర నిర్మాణంలో అల్లు అరవింద్, బన్నీవాసు ఎంతో సహకరిస్తారని తెలిపారు. తన దృష్టిలో గీతా ఆర్ట్స్‌కు ఎప్పుడూ అగ్రస్థానమేనని పేర్కొన్నారు. 'తండేల్' గురించి బన్సీవాసు 10 నిమిషాలు చెప్పారని, అప్పుడే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి ఏర్పడిందన్నారు. 
 
సినిమాలో 'తండేల్' రాజుకు, తన జీవితానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని నాగ చైతన్య పేర్కొన్నారు. ఆ పాత్రలోకి మారేందుకు చందు తనకు కావాల్సినంత సమయం ఇచ్చాడని తెలిపారు. చందు కాంబినేషన్‌లో తనకు ఇది మూడో సినిమా అని పేర్కొన్నారు. నటి సాయిపల్లవి పట్ల ఇంతటి అభిమానాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఆర్టిస్టు పట్ల ఇంత ఏకపక్షంగా వ్యవహరించిన ధోరణిని ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులోనూ చూడబోమని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు