అల్లు అర్జున్ ఇంట్లోకి రేంజ్ రోవర్ కారు

ఆదివారం, 25 ఆగస్టు 2019 (10:53 IST)
మార్కెట్‌లోకి ఎలాంటి కొత్తకారు వచ్చినా ఆ మరుసటి రోజు అది సెలెబ్రిటీల ఇళ్ళలో దర్శనమిస్తుంది. అంటే.. ఆ కొత్త కారును సెలెబ్రిటీలు కొనుగోలు చేస్తుంటారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్ర‌తి విష‌యంలో స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటాడు. అందుకే ఇటీవ‌ల భారీ ఖ‌ర్చుతో సొంతంగా కార‌వ్యాన్ త‌యారు చేయించుకున్నాడు. ముంబైకు చెందిన ప్ర‌ముఖ డిజైన‌ర్ అల్లు అర్జున్ టేస్ట్‌కి త‌గ్గ‌ట్టు ఇంటీరియ‌ర్‌ని డిజైన్ చేశారు. 
 
ఇక తాజాగా త‌న గ్యారేజ్‌లోకి మ‌రో కొత్త వాహ‌నాన్ని బన్నీ తీసుకొచ్చారు. రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారును కొనుగోలు చేసిన బ‌న్నీ ఆ కారుతో ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంట్లోకి మ‌రో కారు వ‌చ్చింది. దానికి బీస్ట్ అని పేరు పెట్టిన‌ట్టు తెలిపాడు. తాను ఎప్పుడు కొత్త వస్తువు కొన్నా, 'విశ్వసనీయత' అనే ఒకే ఒక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటానని వెల్లడించారు. 
 
కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో "అల‌.. వైకుంఠ‌పుర‌ములో" అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ట‌బు, స‌త్య‌రాజ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు