రూ. 35 లక్షల బీఎండబ్ల్యు కారును నదిలో తోసేసిన యువకుడు..(video)

శనివారం, 10 ఆగస్టు 2019 (16:33 IST)
కోపం ఎంతటి అనర్థాన్నయినా సృష్టిస్తుంది. ఈ కోపం కారణంగా ఎన్నో కోల్పోతారు చాలామంది. అలాంటి కోపాన్నే ప్రదర్శించాడు ఓ యువకుడు. కాకపోతే తన కోపాన్ని బీఎండబ్ల్యు కారుపై చూపించాడు. తనకు నచ్చిన బ్రాండ్‌ కారు కొనివ్వలేదని రూ. 35 లక్షలకు పైగా విలువ చేసే కొత్త బీఎండబ్ల్యు కారును నదిలోకి తోసేశాడు.
 
వివరాలను చూస్తే... హరియాణా రాష్ట్రంలో యమునానగర్‌కు చెందిన ఓ భూస్వామి కుమారుడు తనకు ఎంతో ఇష్టమైన జాగ్వర్‌ కారు కొనివ్వాలని తండ్రిని అడిగాడు. కానీ వారు అతడికి జాగ్వార్ కాకుండా బీఎండబ్ల్యు కారును తీసిచ్చారు. ఆ కారు తనకు వద్దని చెప్పినా పట్టించుకోలేదు వారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు ఆ కారులో వెళ్లి సమీపంలోని నదిలోకి తోసేశాడు. నదీ ప్రవాహానికి అది అలా కొట్టుకుపోతుండటంతో స్థానికులు అక్కడికి చేరుకుని అతడు చేసిన పనికి ఆశ్చర్యపోయి చూస్తూ వున్నారు. 
 
ఆ తర్వాత అతడి కోపం చల్లారాక గజ ఈతగాళ్లను పిలిపించి మళ్లీ కారును ఒడ్డుకు లాక్కుని వచ్చాడు. ఈ వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. విషయం పోలీసులకు తెలియడంతో యువకుడుని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు