మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూర్చుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అది సాధ్యపడలేదు. రెహ్మాన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిరంజీవి ఆశ నెరవేరలేదు.
అయితే, తాజా సమాచారం మేరకు త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయనున్న సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించనున్నారని వినికిడి. రెహ్మాన్‌తో కంపోజింగ్ చేయించాలన్నది దర్శకుడు విక్రమ్ కుమార్ ఆలోచనట.