రూ.10 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన పుష్పరాజ్!

శనివారం, 16 డిశెంబరు 2023 (10:16 IST)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమాతో బన్నీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అదే పుష్ప సినిమాకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లింది. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. 
 
పలు ప్రొడక్ట్ ప్రమోషన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప-2" సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ అల్లు అర్జున్‌కి పుష్ప-2 సినిమా షూటింగ్ సమయంలో 10 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. 
 
అయితే అల్లు అర్జున్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. తమ యాడ్ షూట్ కోసం తాను రోజుకు రెండు గంటలు మాత్రమే కెమెరా ముందుకు వచ్చి ఇలా వెళ్లిపోతానని, ఇందుకు రూ.10 కోట్ల వరకు చెల్లిస్తానని ఓ సంస్థ ఐకాన్ స్టార్‌కి ఆఫర్ ఇచ్చింది. దాన్ని బన్నీ తిరస్కరించాడు. ఎందుకంటే ప్రకటన ఆల్కహాల్, పొగాకు బ్రాండ్‌కు సంబంధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు