అమ‌ల‌, శర్వానంద్ సినిమా ఒకే ఒక జీవితం

శుక్రవారం, 5 నవంబరు 2021 (17:03 IST)
oke oka jeevitam, Amala, Sharwanand
శర్వానంద్ కెరీర్‌ లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.
 
దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అక్కినేని అమల గోడపై  కూర్చుని ఉన్నారు. శర్వానంద్, అతని తమ్ముడు అమ్మ ఒడిలో తల పెట్టుకుని అలా సేద తీరుతున్నారు. ఈ పోస్టర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతున్నాయి.
 
తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ చిత్రంలో భాగం అయ్యారు.
 
శర్వానంద్‌కు  క్రేజ్ కి తగ్గట్టుగా  ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతోంది. తల్లీ కొడుకుల బంధం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
 
ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.
 
నటీనటులు : శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు