ఇక ''అమర్ అక్బర్ ఆంటోని'' సినిమా టైటిల్‌కి తగినట్టుగానే మూడు డిఫరెంట్ లుక్స్‌తో తెరకెక్కింది. విదేశాల్లోని లొకేషన్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ వున్న బలగం కాదు .. మనలోని బలం' అని రవితేజ చెప్పిన డైలాగ్ బాగుంది. లవ్, యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు.