జబర్దస్త్ యాంకర్ అనసూయ మళ్లీ ఐటమ్ సాంగ్ చేయనుంది. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2 సినిమా రూపుదిద్దుకుంటోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నట్లు తెలుస్తోంది. వెంకీ, వరుణ్‌లతో అనసూయ స్పెషల్ సాంగ్ వుంటుందని టాక్.
దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని టాక్ వస్తోంది. ఇకపోతే.. ఎఫ్-2లో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, రంగస్థలం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అనసూయ.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కథనం అనే చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.
ఇలా బుల్లితెరపై, వెండితెరపై అనసూయ జోరు కొనసాగుతోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిన అనసూయ.. తాజాగా ఎఫ్2 చిత్రంలో చేసే స్పెషల్ సాంగ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంటుందని టాక్ వస్తోంది.