యాంకర్ ఝాన్సీ చెప్పిన రహస్యం!

గురువారం, 19 నవంబరు 2015 (21:34 IST)
తెలుగులో పలు హిట్‌ గీతాలను ఆలపించిన గాయని ప్రణవి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ రఘు మాస్టర్‌ని చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం ఇటీవలే జరిగిన ఓ ఆడియో వేడుకలో బయటపెట్టింది యాంకర్‌ ఝాన్సీ. 
 
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు. రఘు మాస్టర్‌ కూడా పలు సూపర్‌ హిట్‌ పాటలకు డ్యాన్స్‌ మాస్టర్‌గా వ్యవహరించారు. ఒకరేమో పాటలు పాడటం మరొకరేమో ఆ పాటలకు నృత్యాలను సమకూర్చడంతో ఇద్దరూ ఒకే రంగానికి చెందినవారు కావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి