సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో, ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్నాయి. దీంతో మహేష్, అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ వార్ ఆసక్తిగా మారింది. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కనిపించి లీకులపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. మన సినిమా సంక్రాంతికి రిలీజ్ కదా.. ఇప్పుడే ప్రమోషన్స్ ఎందుకు అన్నట్టుగా ఓ డైలాగ్ వదిలాడు. ఈ డైలాగ్ బన్నీ సినిమా అల.. వైకుంఠపురములో చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నాడని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రమోషన్స్‌లోనే ఇంతగా పోటీపడుతున్నారు ఇక బాక్సాఫీస్ వార్‌లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో అనేది మరింత ఆసక్తి పెంచింది. అదీ.. సంగతి.