సినిమా కోసం ఎవరు సూచన చేసినా స్వీకరిస్తా: అనుదీప్
మంగళవారం, 9 మార్చి 2021 (16:50 IST)
Anudeep director
``సినిమా బాగా రావడానికి ఎవరు సూచనలు చేసినా స్వీకరిస్తాను. హీరో నవీన్ కూడ కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. నవీన్ కోసం కొన్ని ప్రత్యేకమైన సీన్స్ రాశాం. కానీ కథ డిస్ట్రబ్ కాలేదు. నాగ్‌అశ్విన్‌గారు ఇచ్చిన ఇన్‌పుట్స్ తీసుకున్నాను. ఫైనల్‌గా వారినుంచి గ్రహించినదాన్నిబట్టి నా శైలిలో ముందుకు వెళతాను`` అని జాతిరత్నాలు` దర్శకుడు అనుదీప్ అంటున్నారు. ఇంతకుముందు `పిట్టగోడ` సినిమా చేశాడు. అది అంతగా ఆదరణపొందలేదు. ఆ సినిమా తర్వాత ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాను. ఆ తర్వాత కొంతగేప్ తీసుకుని ఓ షార్ట్‌ఫిలిం చేశాను. అది చూసి నాగ్ అశ్విన్ ఈ సినిమాకు అవకాశమిచ్చారని అనుదీప్ చెబుతున్నాడు. ఆయన చెప్పిన మరిన్ని విశేషాలు.
- మాది సంగారెడ్డి. అమీర్‌పేటలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తయిన తర్వాత మిస్డ్‌కాల్డ్ అనే షార్ట్‌ఫిల్మ్ చేశాను. స్కూల్ డేస్‌నుండే నేను డైరెక్షన్ అంటే నాకు ఇంట్రెస్ట్. `ఉయ్యాల జంపాల` సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను.
- పిట్టగోడ నా ఫస్ట్ సినిమా. జాతిరత్నాలు నా సెకండ్ సినిమా. పిట్టగోడ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ సమయంలో నాగ్ అశ్విన్‌గారు నేను చేసిన ఓ కామెడీ షార్ట్‌ఫిల్మ్ చూసి నన్ను కలిశారు. నా తొలి సినిమా అంతగా ఆడకపోయిన నన్ను బాగా ట్రీట్ చేశారు.
- చట్టాలు, కోర్టులు వంటి వాటి గురించి ఏం తెలియని ఓ ముగ్గురు అమాయకులు ఓ సీరియస్ క్రైమ్‌లో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? అనే బ్యాక్‌డ్రాప్‌లో జాతిరత్నాలు సినిమా కథనం ఉంటుంది. నవీన్, రాహుల్, ప్రియదర్శి, ఫరియా మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వీళ్లే కాదు. సినిమాలో క్యారెక్టర్ చేసిన ప్రతివారికి ఇంపాక్ట్ కనిపిస్తుంది. సెటైరికల్ కామెడీ మూవీ ఇది. కొన్ని సమకాలీన అంశాలను సెటైరికల్, ఫన్నీ వేలో చెప్పాం.
- చాలా సరదాగా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. అసలు ఒత్తిడిగా అనిపించలేదు. సినిమా పూర్తయిన తర్వాత అమోజాన్ ప్రైమ్ నుంచి కూడ ఓ ఆఫర్ వచ్చింది. కానీ థియేటర్స్‌లో ఆడియన్స్‌ను నవ్విద్దామని డిసైడై థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం. నేను అల్పసంతోషిని. సినిమా మీద ఫ్యాషన్ వేరు.
- నేను, నాగ్‌అశ్విన్, సమర్, మేం ముగ్గురం కలిసి కథను డెవలప్ చేశాం. కథ ఎలా ఉండాలి,ఆడియన్స్‌కు ఎలాంటి ట్రీట్ ఇద్దామనే అంశాలను కలిసే డిస్కష్ చేసుకున్నాం. నాగ్‌అశ్విన్ ఈగోలెస్ పర్సన్. తాను చెప్పిందే జరగాలని అనడు. అందుకే సినిమా అవుట్‌పుట్ ఇంత బాగా వచ్చింది.ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు తీసుకోవడం, తీసుకోక పోవడం అనేది డైరెక్టర్‌గా నా నిర్ణయం.
- నాగ్‌అశ్విన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రధన్ పేరును సూచించారు. కథ విని రధన్ కూడ ఎగ్జైట్ అయ్యారు. ఓ కొత్త సౌండింగ్ ఇవ్వడానికి నాకు కూడ బాగుంటుదని రధన్ ఫీలయ్యాడు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్‌ఆర్ కూడ అదిరిపోయింది. కథ ప్రకారం మూడు పాటలే ఉన్నాయి.
- నాగ్‌అశ్విన్ సినిమాల్లో ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో జాతిరత్నాలు సినిమా ఉంటుంది. అందుకే నన్ను తీసుకున్నారు. నాగ్ అశ్విన్ కు కూడ కామెడీ సినిమాలు అంటే ఇష్టమే. ఎమోషన్స్‌లో నవ్వడం అనేది హైయ్యేస్ట్ పాయింట్.
- బ్రహ్మనందంగారితో జడ్జ్ క్యారెక్టర్ వేయించాం. కథ ప్రకారం జడ్జ్ క్యారెక్టర్‌కు డైలాగ్స్ లేవు. కానీ స్వప్నగారు బ్రహ్మనందంగారితో జడ్జ్ క్యారెక్టర్ చేయిద్దాం అనగానే అప్పుడు కొన్ని డైలాగ్స్, సీన్స్ పెంచాం. కథ డిస్ట్రబ్ కాకుండానే ఈ పని చేశాం.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక కామెడీ స్క్రిప్ట్
- హారర్, వైలెన్స్ జానర్ సినిమాలు తప్ప అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. పిట్టగోడ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో కొన్ని కథలు రాసుకున్నాను. ఇకపై స్పీడ్‌గా సినిమాలు చేస్తాను. కామెడీ, డ్రామా, యాక్షన్ సినిమాలు ఇష్టం. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక కామెడీ స్క్రిప్ట్ రాస్తున్నాను. ఆ కథ గురించి అశ్వనీదత్‌గారితో డిస్కస్ చేయాల్సి ఉంది. నా నెక్ట్స్ సినిమా ఈ బ్యానర్‌లోనే ఉంటుంది.