మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “గాడ్ ఫాథర్” విడుదలకి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా పలురకాల మీడియాను చిరంజీవి వినియోగించు కుంటున్నారు. తాజాగా మెగా 154 సెట్లో చిరంజీవితో చిట్‌చాట్ చేయడానికి అన్ని విధాలుగా జాతీయ స్థాయి విలేఖరి అనుపమ చోప్రా ప్రయత్నించింది. తన రాబోయే సినిమాల గురించి, కొన్ని పర్సనల్ విషయాల గురించి, రాజకీయాల గురించి ఆమె ప్రశ్నలు సంధించింది.