యాక్షన్ హీరో అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు అర్జున్. అందుకే యాక్షన్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు. యాక్షన్ హీరోగానే కాదు విభిన్నమైన పాత్రలతో మోస్ట్ స్టైలిష్ యాక్టర్‌గా సౌత్‌లో తన ఇమేజ్‌కు కొత్త గ్లామర్ తెచ్చుకున్నాడు అర్జున్. రీసెంట్‌గా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా", "అభిమన్యుడు" సినిమాలతో ఈ జనరేషన్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. హీరోగా కెరియర్ మొదలు పెట్టిన అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే 150 మూవీ మైలు రాయిని చేరుకున్నాడు.
కురుక్షేత్రం అర్జున్ 150వ మూవీగా తెలుగులో త్వరలో విడుదలకు కాబోతుంది. అర్జున్ అనగానే గుర్తుకు వచ్చే యాక్షన్‌కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి మరోసారి ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయబోతున్నాడు. తమిళంలో "నిబునన్"గా విడుదలై మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీ తెలుగులో "కురుక్షేత్రం"గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బిగ్ బాస్ సీజన్ 2లో తనదైన స్టైల్లో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ట్రైలర్‌ని తన ట్విటర్ ద్వారా విడుదల చేసారు. హాలీవుడ్ థ్రిలర్‌ని తలపిస్తున్న కురుక్షేత్రం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్‌గా మారబోతుందని అన్నారు. అర్జున్ ఇప్పటివరకూ పోలీస్ పాత్రలు చాలా చేసినా ఒక భిన్నమైన పోలీస్ అధికారిగా ఇందులో కనిపించబోతున్నారు. మళయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ కురుక్షేత్రం చిత్రాన్ని ఆద్యంత ఆసక్తిగా మలిచారు.
ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని థ్రిల్లర్‌గా కురుక్షేత్రం అలరించబోతుంది. అర్జున్ కెరియర్లో భిన్నమైన చిత్రంగా మారిన "కురుక్షేత్రం" మోస్ట్ మెమరబుల్ మూవీ కాబోతుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, వైభవ్, శ్రుతి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సమర్పణ : ప్యాషన్ స్టూడియోస్, సంగీతం: ఎస్. నవీన్, మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ: అరవింద్ కృష్ణ, ఎడిటింగ్: సతీష్ సూర్య, పీఆర్వో- జి.ఎస్.కె మీడియా, కో-ప్రొడ్యూసర్-పి.ఎల్ అరుల్ రాజ్, నిర్మాతలు: ఉమేష్, సుదన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్. స్క్రీన్ ప్లే - ఆనంద్ రాఘవ్, అరుణ్ వైద్యనాథన్, కథ,దర్శకత్వం - అరుణ్ వైద్యనాథన్.