బిగ్ బాస్ షోలో తన్నులాట.. ఎవరెవరంటే?

శుక్రవారం, 22 జూన్ 2018 (19:14 IST)
బిగ్ బాస్ సీజన్ 2 చప్పగా సాగుతోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో షోను రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. గురువారం రాత్రి ఎపిసోడ్‌ చివర్లో చూపించిన రేపటి దృశ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సభ్యులు ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలతో ఊగిపోతూ సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది. 
 
తనీష్, నూతన్ నాయుడు, సామ్రాట్ పెద్ద స్వరంతో…. నోరు మూసుకో, చేతులకు గాజులు తొడుక్కోలేదు, రేపటి నుంచి చూసుకుందాం… వంటి పరుష పదాలతో ఒకరిని ఒకరు దూషించుకోవటం గమనార్హం. అసలు అంత తీవ్రమైన గొడవలు ఎందుకొచ్చాయి, బిగ్ బాస్ ఎటువంటి లిటిగేషన్ పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. 
 
తన ఆదేశాలను సక్రమంగా పాటించడం లేదంటూ గురువారం హెచ్చరిక పంపిన బిగ్ బాస్ శుక్రవారానికి సభ్యుల మధ్య గొడవలు సృష్టించినట్లు అర్థమవుతోంది. మరి ఏమి జరిగిందో తెలియాలంటే శుక్రవారం నాటి ఎపిసోడ్ చూడాల్సిందే.
 
ఇదిలావుండగా గురువారం రాత్రి ఎపిసోడ్‌లో వెన్నెల కిషోర్, శివారెడ్డి అతిథులుగా బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశించారు. గంటసేపు గడిపారు. శుక్రవారం నాడు శ్రీనివాసులు రెడ్డి సినిమా జంబలకడిపంబ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హౌస్‌లోకి వెళ్లారు. సభ్యుల తప్పుఒప్పులను సరదా సంభాషణలతోనే శ్రీనివాసులు రెడ్డి ఎత్తిచూపారు. ఇది సభ్యులకు కొంత ఆహ్లాదాన్ని పంచింది. సభ్యులందరూ తరచు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుండటంతో కెప్టెన్ సామ్రాట్‌కు బిగ్ బాస్ శిక్ష విధించారు. సభ్యులు ఎవరైనా ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు బజర్ అవుతుందని, ఆ వెంటనే కెప్టెన్ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు అందిన కొంతసేపటికే సామ్రాట్ నీళ్లలో దూకాల్సి వచ్చింది.
 
ఇదిలావుండగా రాత్రి కూడా నిద్ర లేకుండా టాస్క్‌లు ఇస్తూ సభ్యులకు చికాకు తెప్పించే ప్రయత్నం జరుగుతోంది. రాజు, రాణిని బంధించిన జైలు తాళం చెవిని దొంగిలించేందుకు ఒక గ్రూపు, దాన్ని కాపాడుకునేందుకు ఒక గ్రూపు ప్రయత్నిస్తూ బుధవారం రాత్రంతా నిద్రలేకుండా గడిపాయి. కొన్ని కొవ్వొత్తులను ఇచ్చి రాత్రంతా అవి ఆరిపోకుండా వెలిగిస్తూనే ఉండాలని టాస్క్ అప్పగించి గురువారం రాత్రి నిద్రకు అవకాశం లేకుండా చేశారు. ఇది సభ్యులకు ఆగ్రహం, ఆవేశం తెప్పిస్తున్నాయి. దీని పరిణామాలు శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బయటపడనున్నాయి. మొత్తమ్మీద బిగ్ బాస్ షోలో మెల్లగా కాక పెంచుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు