జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి 2' . ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించిన 'బాహుబలి' ది బిగినింగ్‌కు ఇది కొనసాగింపుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాహుబలి 2 ట్రైలర్‌ను 'రయీస్'తో పాటు విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. ''బాహుబలి 2' ట్రైలర్ 'రయీస్'తో జతచేసి విడుదల చేస్తున్నారని వచ్చిన పుకార్లను సినిమా యూనిట్ ఖండించింది. ఈ నేపథ్యంలో బాహుబలి 2 గురించి రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలికంటే ముందు ఈగ చిత్రం చేయడం తనకు ఎంతో ఉపకరించిందని చెప్పాడు.
సినిమా బాగుంటే ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా వీక్షిస్తారని, ప్రేక్షకులను బాహుబలిలోకంలోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతోనే చాలా ఇష్టపడి ఈ సినిమాను చేసినట్లు రాజమౌళి చెప్పారు. అమర చిత్ర కథల నుంచే తను ప్రేరణ పొందేవాడినని, ఈ అమర చిత్రకథ పుస్తకాలు ఈ రోజుటికీ చదువుతానని రాజమౌళి చెప్పుకొచ్చారు. సినిమా అవుట్ పుట్ సరిగ్గా వచ్చేందుకు ఎక్కడా రాజీ పడలేదని జక్కన్న చెప్పాడు.