నిజంగానా? బాహుబలి ఇంటర్వెల్ సీన్ లీకైందట. బాహుబలి-2 ది కన్‌క్లూజన్ వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ పోర్టల్‌లో విక్రయానికి పెట్టడంతో, ప్రేక్షకులు ఆన్ లైన్ పోర్టల్‌కు పోటెత్తారని, దీంతో కేవలం 24 గంటల్లోనే పది లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది సినీ చరిత్రలో రికార్డని విక్రేతలు వెల్లడించారు.
భారీ బడ్జెట్‌తో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమాకు చెందిన పలు సీన్లు ఇప్పటికే లీకైపోయి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయని ఎన్నో వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బాహుబలి జోకులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో విపరీతంగా ఆసక్తి రేపుతోంది. ఈ వీడియోను చూసి కొన్ని క్షణాల పాటు నిజంగానే బాహుబలి ఇంటర్వెల్ సీన్ లీకై పోయిందని నెటిజన్లు భావిస్తున్నారు.