నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. ఈ సినిమాని తమిళ దర్శకుడు కె.ఎస్. రవి కుమార్ తెరకెక్కించారు. గతంలో వీరిద్దరు కలిసి జై సింహ అనే సినిమా చేసారు. ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా... ఫరవాలేదనిపించింది... యావరేజ్‌గా నిలిచింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూలర్ అనే సినిమా వస్తుందని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి బాగానే ఉండచ్చు అనే పాజిటివ్ టాక్ ఏర్పడింది.
అయితే... రూలర్ ట్రైలర్.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మరో ట్రైలర్ రిలీజ్ చేసారు ఈ ట్రైలర్ కూడా అంతే. మెప్పించలేకపోయింది. ఇలా.. ట్రైలర్ తో మెప్పించలేకపోయిన రూలర్ థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడులో ఎన్నో ప్రశ్నలు. ఈ కథను ఎలా ఎంచుకున్నారు..? ఇప్పుడు దర్శకులు, హీరోలు అప్ డేట్ అవుతుంటే... బాలయ్య ఏమాత్రం అప్ డేట్ కాకుండా ఇలా పాత కథలను ఎందుకు ఎంచుకుంటున్నారు..?
పోలీసాఫీసర్ అంటే ఎలా ఉండాలి..? ఆయన గెటప్ ఏంటి..? ఆ హెయిర్ స్టైల్ ఏంటి..? లింకులు లేకుండా సడన్ గా వచ్చే ఆ పాటలేంటి..? ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలు. హీరో ఉన్నాడు, డబ్బులు పెట్టే నిర్మాత ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒక సినిమా చేసేయాలి అని రూలర్ సినిమా చేసినట్టు ఉంది తప్పా.. ఎక్కడా కూడా సిన్సియర్‌గా సినిమా చేసిన ఫీలింగ్ ఆడియన్ కి ఏ సన్నివేశంలో కూడా అనిపించదు.