రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

దేవీ

మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (17:43 IST)
Bandi Saroj Kumar look
తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన అద్భుతమైన నటనతో అలరించిన హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .
 
ఈ చిత్రంలో మల్టీ ట్యాలెంటెడ్ బండి సరోజ్ కుమార్ ఓ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ఈ రోజు నోలన్ గా ఆయన పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కాండిల్ తో సిగరెట్ వెలిగిస్తూ ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంత రూత్ లెస్ గా వుండబోతోందో ఈ పోస్టర్ తెలియజేస్తోంది.
 
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ రోషన్‌ను హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో చూపించింది. ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా ఆరంగేట్రం చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుండగా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లేను రామ మారుతి ఎం,  రాధాకృష్ణ రెడ్డి రాశారు.
 
ప్రతిభావంతులైన తారాగణం, టెక్నికల్ టీంతో రూపొందుతున్న మోగ్లీ 2025  సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు