యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

దేవీ

గురువారం, 10 ఏప్రియల్ 2025 (16:03 IST)
Anil Buragani, R Jwalitha,
గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ 'ప్రేమ‌కు జై'. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అవుతోంది. ఈ వైవిద్యమైన ప్రేమ కథ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌పై చూడ‌ని ఓ ల‌వ్‌స్టోరీని చూపించ‌బోతున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. 
 
ఈ సంద‌ర్భంగా 'ప్రేమకు జై' దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు.
 
అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దుబ్బాక భాస్కర్ విలన్. ఈ చిత్రానికి ఎడిటర్: సామ్రాట్, సినిమాటోగ్రాఫర్: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు,  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం రాజేష్, సహ నిర్మాత: మైలారం రాజు, నిర్మాత: అనసూర్య, కథ - దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు