బాలీవుడ్‌లోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ : ఛత్రపతి రీమేక్‌తో ఎంట్రీ!!

గురువారం, 19 నవంబరు 2020 (13:13 IST)
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ ఛత్రపతి మూవీతో ఆయన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. 
 
'సాహో' చిత్రంతో బాలీవుడ్‌లో కూడా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తున్నారట. ఈ విషయంలో ప్రస్తుతం అనన్య పాండే, సారా అలీఖాన్‌లతో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.
 
కాగా, తెలుగులో ఛత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. అలాగే, ప్రభాస్‌ మూవీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ప్రభాస్ రేంజ్‌ను ఈ చిత్రం తారాస్థాయికి చేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం అంతటి ఘనవిజయాన్ని సాధించాలని ఆశిద్ధాం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు