మోహన్ లాల్ కాస్త భజన్ లాల్ అయ్యాడు.. జనతా గ్యారేజ్ టర్న్స్ సమంత గ్యారేజ్?

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (18:41 IST)
అల్లరి నరేష్ ''జనతా గ్యారేజ్'' స్పూఫ్‌ను రెడీ చేశాడు. ఈ స్పూఫులో అలీ నటించాడు. ఇదంతా అల్లరి నరేష్ కొత్త సినిమా ''ఇంట్లో దెయ్యం నాకేం భయం'' సినిమా కోసం. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రెడీ చేసిన స్పూఫ్‌లో అలీ జనతా గ్యారేజ్‌లోని మోహన్ లాల్ పాత్రని భజన్ లాల్‌గా మార్చి కామెడీ పండించబోతున్నాడు. అలీ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
మోహన్ లాల్ గెటప్పులో అలీ భజన్ లాల్‌గా బాగానే ఆకట్టుకుంటాడని సినీ యూనిట్ అంటోంది. ఈ  స్పూఫ్ ఎలా ఉంటుందోనని సినీ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా అల్లరి నరేష్ అంటేనే స్పూఫులకు మారు పేరు. హిట్ సినిమా ట్రాక్‌లను కామెడీగా వాడుకొని కితకితలు పెడుతుంటాడు. మొన్నటి మొన్న రిలీజ్ అయిన "సెల్ఫీరాజా" వరకూ స్పూఫులపై ఆధారపడినవే. తాజాగా జనతా గ్యారేజ్‌ను కూడా అల్లరి నరేష్ ''ఇంట్లో దెయ్యం నాకేం భయం'' కోసం వాడుకుంటున్నాడు. ఇక జనతా గ్యారేజ్ కాస్త సమంత గ్యారేజ్‌గా మార్చేసి స్పూఫ్ చేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి