రోజురోజుకు బలపడుతున్న మన మాతృభూమి భారత్ ని బలహీనం చేసేందుకు "డ్రేగన్ కంట్రీ" చైనా పన్నుతున్న దుష్ట పన్నాగాలను, ఈ క్రమంలో ఆ దేశం చేస్తున్న దురాగతాలను బట్టబయలు చేస్తూ రూపొందిన ద్విభాషా చిత్రం "భారతీయన్స్". ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా" వంటి బ్లాక్ బస్టర్ లవ్ మూవీస్ కి కథలను అందించిన సంచలన రచయిత దీన్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 14న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.