బిగ్‌బాస్‌ రన్నర్‌కు సూపర్ ఛాన్స్.. సీటీమార్‌లో విలన్‌గా ఛాన్స్

బుధవారం, 6 జనవరి 2021 (16:16 IST)
Akhil
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్న కంటిస్టెంట్స్‌కు సినీ ఛాన్సులతో పాటు టీవీ రంగంలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అభిజీత్‌, సోహైల్‌, మోనాల్‌ గజ్జర్‌, మెహబూబ్‌, దివి, అరియానా, అవినాష్‌ మంచి అవకాశాలను అందుకున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ సార్ధక్‌కు కూడా మంచి అవకాశం వచ్చేసింది. 
 
గోపీచంద్‌, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తోన్న 'సీటీమార్‌' సినిమాలో ఓ కీలక పాత్రకు అఖిల్‌ను ఎంపిక చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'సీటీమార్‌' చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. నిజానికి 'బావ మరదలు' సినిమాలో అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 
 
అయితే పెద్దగా ఆదరణ దక్కలేదు. అదే సమయంలో బుల్లితెర వైపు అడుగులేసి పలు సీరియల్స్‌ నటించాడు గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు అఖిల్‌. ప్రస్తుతం గోపి చంద్ చిత్రంలో విలన్‌గా అఖిల్ విలన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు