ఈనెల 20న వస్తున్న "బొంబాయి మిఠాయి"

బుధవారం, 18 జనవరి 2017 (17:19 IST)
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న "బొంబాయి మిఠాయి" ఈనెల (జనవరి) 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కన్నడలో ఘన విజయం సాధించిన "బొంబాయి మిఠాయి" చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించారాయన. దిశా పాండే, విక్రమ్, నిరంజన్ దేశ్ పాండే, బులెట్ ప్రకాష్, కిషోర్ బల్లా ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకుడు. 
 
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించిందని.. తెలుగులోనూ మంచి విజయం సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. పెద్ద సినిమాలేవీ ఈవారం విడుదల కాకపోతుండడం "బొంబాయి మిఠాయి"కి లాభించనుందని ఆయన అన్నారు. కృష్ణతేజ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి పాటలు పోతుల రవికిరణ్, సంగీతం: వీర సమరత్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: చంద్రమోహన్. 

వెబ్దునియా పై చదవండి