ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఇప్పటికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుందని, రానున్న రోజుల్లో ఈ సినిమా బుకింగ్స్ మరింతగా పెరుగుతాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు.