కానీ కొన్ని పరిమితుల కారణంగా మల్టీప్లెక్సుల్లో సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో సినిమాను మూడు గంటలకు కుదిరించారట. సినిమా నిడివిని పొడిగించాలనుకుంటున్నామని, 40 నిమిషాల ఎడిటింగ్ ఫుటేజీని మళ్లీ కలపాలనుకుంటున్నట్లు విజయ్ దేవర కొండ అన్నారు. ఈ కట్ చేసిన ఫుటేజీ కథకు ఎంతో కీలకమన్నాడు.
ఇదిలా ఉంటే.. అర్జున్ రెడ్డి సినిమా ఓ వైపు హిట్ టాక్తో దూసుకుపోతూనే మరోవైపు వివాదాల సునామీ సృష్టిస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ భారీకల్లెక్షన్లు వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. హిందీలో అర్జున్ రెడ్డి పాత్రలో బాలీవుడ్ అగ్రనటుడు రణ్వీర్ సింగ్ నటించనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.