R. Narayamurthy, Raitanna
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ ను తలపిస్తుందని ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. అయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రైతన్న సినిమా పూర్తయింది. దీని గురించి మాట్లాడుతూ: బడ్జెట్ లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశాన్నే ప్రస్తావించలేదని ఆరోపించిన నారాయణమూర్తి, డాక్టర్ స్వామినాథన్ ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.