అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం "తండేల్". చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నాగ చైతన్య అర్థాంగి శోభిత ధూళిపాళ్ల చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టిసారించారని పేర్కొన్నారు. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ తన భర్తను ఉద్దేశించి పోస్ట్ చేసింది.
దీనిపై చైతన్య స్పందించారు. థ్యాంక్యూ మై బుజ్జితల్లి అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మీ బాండింగ్ చాలా బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. కాగా, శోభిత, నాగ చైతన్య గత యేడాది డిసెంబరు 4వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే.