రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజకీయాల్లో వున్న శ్రద్ధ సినిమారంగంలో లేదు. ఒకవైపు ఆర్.ఆర్.ఆర్. వంటి సినిమాతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పరిశ్రమను మన ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడంలేదు.ఒకప్పుడు నంది అవార్డులు అని కళాకారులకు ప్రోత్సాహాలుగా బహుమతులు ఇచ్చేవారు. కానీ రెండు రాష్ట్రాలు అయ్యాయి. సినిమాను పట్టించుకోవడంలేదు. కానీ ప్రైవేట్ సంస్థలు టైమ్స్, సంతోషంవంటి కొన్ని సంస్థలు దక్షిణాది కళాకారులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఒక రకంగా ప్రబుత్వాలకు సవాల్ గా నిలిచాయి.