సాంగ్ నేపథ్యం...
జీపులో కలర్ డ్రెస్‌లో బాలకృష్ణ, హనీరోజ్ ని తీసుకుని స్పీడ్‌గా వచ్చి పంజాబ్ దాబా దగ్గర ఆగుతాడు. గోలీషోడా తాగడానికి సిద్ధంగా వుండగా, చంద్రికరవి తన టీమ్‌తో ఐటెం సాంగ్ పాడుతుంది. పక్కా మాస్ మసాలా సాంగ్‌తో రూపొందిన ఈ పాట నేపథ్యం ఇలా వుంది.
బావ బావ.. అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి, అదే రాసుకుళ్ళా ఒంటికి. చూసుకో నానా గత్తర చేసి బయటకు పోయాడు.. మా బావ మనోబావాలు దెబ్బతిన్నాయో.. అంటూ సాగిన ఈ పాటలో బాలకృష్ణ, చంద్రికరవి, హనీరోజ్ రెచ్చిపోయి డాన్స్ వేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ పాటను సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ ఆలపించారు. థమన్ స్వరాలు సమకూర్చారు. శేఖర్ వి.జె. కొరియోగ్రఫీ సమకూర్చారు. సినిమాటోగ్రఫీ రిషి పంబాబీ సమకూర్చారు. ఈ పాట బాలకృష్ణ అభిమానులకు ఫిదా చేసింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది.