రాధారవి ఓ స్టేజ్‌లో నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఆయనకు గౌరవం ఇస్తున్నారని.. అదే ఓ మహిళ నోరు విప్పితే ఆమెకు ఏవేవో కథలు కట్టేస్తున్నారని.. గాయని తెలిపింది. ఓ స్టేజ్‌లో రాధారవి.. సినిమాల్లోకి వచ్చే మహిళలు వర్జినీటి టెస్టు చేయించుకుని రావాలని.. అంటే అందరూ ఆయన వ్యాఖ్యలను తప్పు బట్టలేదని చిన్మయి మండిపడింది.
తప్పు జరుగుతుందని చెప్తే.. ఆ తప్పును సరిదిద్దకుండా ఫిర్యాదు చేసిన వారిని ఉద్యోగాల నుంచి తీసేయడం ఏమిటని.. చిన్మయి ప్రశ్నించింది. డబ్బింగ్ యూనియన్ నుంచి తనను కూడా ఇలాగే తొలగించారని ఆమె వెల్లడించింది. మీటూ తాను స్పందించడం వెనుక ఎవ్వరూ లేరని, తన వ్యాఖ్యలకు ఏ పార్టీకి ఏ మతానికి సంబంధం లేదని చిన్మయి స్పష్టం చేసింది.