మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా టీజర్ డేట్ ఫిక్స్ అయింది. టీజర్ లాంచ్ ఈవెంట్ రేపు అనగా జూన్ 24న సంధ్య 70MM, హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానుంది. తమిళ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కుతోంది. దర్శకుడు మెహర్ రమేష్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరో సుశాంత్ కూడా నటిస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, రష్మి గౌతమ్ నటిస్తున్నారు.