అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్., 'నా గురుడు నన్నింకా యోగి గమ్మననె, యోగి గమ్మననె, రాజయోగి గమ్మననె..' అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు.
మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో 'యోగితత్వం' పాట అప్ లోడ్ అయ్యింది. మంగ్లీ పాటలను ఇష్టపడేవారు ఈ పాటకు హయ్యెస్ట్ వ్యూస్ ఇవ్వనున్నారు. శివాణి మాటూరి సమర్పణలో రూపొందిన ఈ పాటకు సినిమాటోగ్రఫీ - తిరుపతి, ఎడిటర్ - ఉదయ్ కంభం.