నవీన్ చంద్ర కథానాయకుడిగా పలు సినిమాలు చేశాడు. కేరెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. అరవింద సమేత చిత్రంలో ఆయన ఆవేశం, కత్తులతో హత్య చేయడం వంటి పాత్రల్లో జీవించేశాడు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ ఇంచుమించు అలాంటివే చేశాడు. కానీ అమ్ము అనే సినిమాలో అంతకుమించి వున్నట్లు నటించాడు. భార్యను ప్రతీ క్షణం అనుమానిస్తూ, సైకోలా వుండే పాత్ర అది. ఆ పాత్రకు ఓటీటీలో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. బయట ఫంక్షన్ కు వెళ్ళినా ఆయనతో మాట్లాడాలంటే భయపడేవారట.
దానికి కారణం కూడా వుంది. ఆయన నటించిన అమ్ము అనే సినిమా భార్యను చాలా టార్చెడ్ పడతాడు. సైకో ప్రతీ దానికి అనుమానిస్తూ శాడిస్టులా బిహేవ్ చేస్తాడు. మరో సినిమా మంత్ ఆఫ్ మధులో ఏకంగా భార్య వుండగా మరో అమ్మాయితో ఎపైర్ పెట్టుకుని భార్యను ఏడిపిస్తాడు. జిగర్ తాండా లోకూ భిన్నమైన పాత్రే చేశాడు. ఇలా ఒక్కో ఒక్కోరకంగా విలనిజం వున్న పాత్రల్లో జీవించేశాడు. ఈ సినిమాల ప్రభావం ఆయన చుట్టాలు, ఆయన నివశించే చుట్టుపక్కల మహిళలపై ప్రబలంగా పడింది. అందుకే వారు నవీన్ చంద్ర భార్యను అడిగారట.
ఈ విషయం ఇంటికి వచ్చాక నవీన్ చంద్రకు భార్య చెప్పిదట. దాంతో నవీన్ చంద్ర నవ్వుకుని. సినిమాలోని పాత్ర ఎంత ప్రభావితం చేస్తుందో అని తెలిసివచ్చింది. ఆ తర్వాత కాలనీలో ఫంక్షన్ జరిగితే వెళ్లి వారితో నవ్వుతూ మాట్లాడుతూ, తన సినిమాల గురించి వివరించాడట. ఈ విషయాన్ని తన లెవెన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెబుతూ, ఇప్పటికీ మా చుట్టాలు నన్ను ఒకరకంగా చూస్తుంటారని నవ్వుతూ చెప్పారు.
అయితే, నవీన్ చంద్ర భార్య మలయాళి. తను ప్రముఖ దర్శకుల దగ్గర అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేసింది. ఎప్పటినుంచో తన భర్తపై కథను రాసుకుని మలయాళం సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు ఓ కథ సెట్ అయింది. త్వరలో ఆయన మలయాళ నటుడు కాబోతున్నాడు. అసలు విషయం ఏమంటే, నవీన్ చంద్ర దాదాపు ఎనిమిది భాషలలో నేర్పరి.