ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

బుధవారం, 3 ఆగస్టు 2022 (12:05 IST)
సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఉదయం ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన సోదరి పాడె మోశారు. 
 
అంత్యక్రియలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు, లోకేష్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఉమామహేశ్వరి అంతిమయంత్ర జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటివద్ద నుంచి మహా ప్రస్థానం వరకు సాగింది. 
 
మహా ప్రస్థానంలో సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆమె మరణం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిల్చింది.
 
సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు