'రామసేతు'కు కరోనా దెబ్బ.. అక్షయ్‌తో పాటు 45 మందికి కోవిడ్ పాజిటివ్

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:22 IST)
బాలీవుడ్‌ను కరోనా కుదిపేస్తోంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా 'రామసేతు' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే.. అది మొదలైన కొద్ది రోజులకే హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా అని తేలింది. దాంతో ఆయన హోమ్ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఇందులో పాల్గొనే వారికి కోవిడ్ 19 పరీక్షలు చేశామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. 
 
అయినా కూడా షూటింగ్ మొదలైన తర్వాత 45 మంది జూనియర్ ఆర్టిస్టులకు కరోనా సోకినట్టు తెలిసిందట. దాంతో వీరందరికీ అక్షయ్ కుమార్ హోమ్ ప్రొడక్షన్ హౌస్ తో పాటు ఈ చిత్ర నిర్మాతలు తమ సొంత ఖర్చుతో చికిత్స చేయిస్తున్నారట. షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు టెస్టులు చేయించడానికి వైద్య బృందాన్ని, తగినన్ని పీపీఇ కిట్స్‌ను అందుబాటులో ఉంచామని నిర్మాతలు చెబుతున్నారు. 
 
ఇందుకోసం లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. అయితే... కరోనా కేసులు ఇలానే పెరిగితే మాత్రం రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్ ను నిర్మాతలు రద్దు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది 'రామసేతు'కు మాత్రమే పరిమితం అవుతుందనీ చెప్పలేం. మొత్తం బాలీవుడ్ లోనూ షూటింగ్స్ ఆగిపోయే ప్రమాదమూ ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు