ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమన్నారు. గోవుల సంక్షేమం కోసం మరింత కృషి జరగాలని, పరిశోధనలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పూర్వం గోవులను సంరక్షించడం ద్వారా తల్లులు ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు.
గతంలో రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కటారియా.. గోవుల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తుందని, ప్రతి ఇంట్లో వాటిని రక్షించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవులను రక్షించకపోతే దేశంలో వ్యవసాయం నాశనమవుతుందని ఆయన అన్నారు. పాఠ్యాంశాల్లో గోవుల గురించి చేర్చకపోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.