రష్మిక డీప్ ఫేక్ వీడియో.. వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

సెల్వి

శనివారం, 20 జనవరి 2024 (16:04 IST)
సినీ నటి రష్మిక డీప్ ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక వీడియోగా మార్ఫింగ్ చేశారు. రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ డీప్ ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఒరిజినల్ వీడియో బ్రిటీష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్‌కు చెందినది. ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక వీడియోగా మార్ఫింగ్ చేశారు. 
 
కాగా డీప్ ఫేక్ వీడియోల పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో డీప్ ఫేక్ వీడియోను సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు