Sai Rajesh Mahadev, Sumaya Reddy, Rajiv Kanakala
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా నటించిన చిత్రం డియర్ ఉమ. ఈ సినిమాను సాయి రాజేష్ మహదేవ్ తెరకెక్కించాడు. రధన్ సంగీత దర్శకుడిగా, రాజ్ తోట కెమెరామెన్‌గా పని చేశారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ప్రేక్షకులు డియర్ ఉమ చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది.