హీరో ప్రదీప్ మాచిరాజు తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రానికి దర్శకత్వం వహించారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకులు నితిన్, భరత్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
-ఇది బ్యూటిఫుల్ జర్నీ. టెలివిజన్ డిఫరెంట్, మూవీ డిఫరెంట్. ఫిక్షన్ కి నాన్ ఫిక్షన్ కి చాలా తేడా ఉంటుంది. మేము ఫిక్షన్ కి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కూడా పనిచేయలేదు. నాన్ ఫిక్షన్ లో జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది. కానీ సినిమా అలా కాదు.. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పరిస్థితిలో షూట్ చేయాల్సి వస్తుంది. దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినంత వరకు అర్థం కాదు. అయితే మాకు చాలా మంచి టీం ఉంది. మా డిఓపి బాల్ రెడ్డి గారు, మ్యూజిక్ రదన్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి టీం వర్క్ తో సినిమాని అద్భుతంగా చేసాం.