"పద్మావతి" దీపికా పదుకొనేకు పెళ్లి అయిందట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు ఎందుకు అన్యాయం చేశావంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికంతటికీ కారణం దీపికా పదుకొనే తాజాగా చేసిన ఓ ఫోటోనే కారణం. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సంతోషంతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.
తాజాగా దీపికా పదుకొనే ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మెడలో దండ ఉన్న వ్యక్తిని కౌగిలించుకుని ఉన్న ఓ ఫోటోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దాని కింద "అప్పుడు, ఇప్పుడు.. ఎప్పటికీ" అని క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఆమెకు పెళ్లి అయిపోయిందంటూ నెటిజన్లు ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ విషయమై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
నిజానికి దీపికతోపాటు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆదిత్య నారాయణ్. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఆదిత్య వివాహానికి హాజరైన దీపిక అతనితో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆదిత్యతో కలిసి చిన్నప్పుడు తీయించుకున్న ఫోటోలను కూడా దీపిక ఇపుడు షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ అయింది. అద్గదీ ఆ ఫోటో వెనుకదాగివున్న సీక్రెట్.
కాగా, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరెక్కించిన చిత్రం పద్మావతి వచ్చే నెల ఒకటో తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ చిత్రంపై వివాదం చెలరేగడంతో చిత్ర యూనిట్ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది.