Dil Raju and Harshit Reddy met with a delegation from the Australian Consulate General
ప్రముఖ నిర్మాత, TSFDC చైర్మన్ శ్రీ దిల్ రాజు, నిర్మాత హర్షిత్ రెడ్డి కలిసి ఇటీవల హైదరాబాద్‌లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ బృందంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య, ముఖ్యంగా సినిమా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను ఎలా మరింత పటిష్టం చేసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.