ఫిల్మ్ చాంబర్ సభ్యులు విచక్షణతో ఓటు వేయండి : దిల్ రాజు

ఆదివారం, 30 జులై 2023 (13:41 IST)
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఆదివారం జరిగే ఎన్నికల్లో సభ్యులు విచక్షణతో, ఆలోచన చేసి ఓటు వేయాలని ఫిల్మ్ చాంబర్ అ
ధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోరారు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో బాగా ఆలోచించి తన ప్యానెల్ సభ్యులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'పరిశ్రమ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అయితే ఈ పోటీలో ఎలాంటి వివాదాలు లేవు. ఫిల్మ్ ఛాంబర్‌ను బలోపేతం చేసేందుకే మేం ముందుకు వచ్చాం. పరిశ్రమలో నాలుగు సెక్టార్లకు ఫిల్మ్ ఛాంబరే సుప్రీం. ప్రతి విభాగంలో సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. 
 
ఎగ్జిబిటర్స్‌కు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలు ఉన్నాయి. పరిష్కరించడానికి టైమ్ కావాలి. వాటి కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కొవిడ్ తర్వాత సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపును మరింత ముందుకు కొనసాగించాలి. 1600 మంది సభ్యులు ఉన్నా రెగ్యులర్‌గా సినిమా తీసేవాళ్లు 200 మంది మాత్రమే. 
 
ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న నిర్మాతలందరూ మా ప్యానెల్లో ఉన్నారు. దిల్ రాజు ప్యానెల్ యాక్టివ్ ప్యానల్, ఫిల్మ్ ఛాంబర్‌లో సరైన వ్యక్తులు ఉంటేనే న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైనా తనకు కిరీటం పెట్టరనీ, కొత్త సమస్యలు తనకు వచ్చినట్లేనని దిల్ రాజు వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు